ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
దిశ, నాచారం: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగరవేయాలి ఆ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి సూచించారు. హబ్సిగూడ డివిజన్ అధ్యక్షుడు కాలేరు జై నవీన్ ఆధ్వర్యంలో గాంధీ గిరిజన బస్తీ లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుకు పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సభ్యత్వంను అందజేశారు. అనంతరం […]
దిశ, నాచారం: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగరవేయాలి ఆ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి సూచించారు. హబ్సిగూడ డివిజన్ అధ్యక్షుడు కాలేరు జై నవీన్ ఆధ్వర్యంలో గాంధీ గిరిజన బస్తీ లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుకు పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సభ్యత్వంను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించడం తో ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందని అన్నారు. రానున్న ఎన్నికల కోసం ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని అధైర్య పడకుండా ఉండాలని సూచించారు. ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు ను విస్తృతంగా చేయాలని నాయకులు, కార్యకర్తలను పరమేశ్వర్ రెడ్డి కోరారు.
ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు కాలేరు జై నవీన్ మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు ను సవాల్ గా స్వీకరించి రికార్డు స్థాయిలో చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు లాలయ్య, రాజు నాయక్, కిషన్ నాయక్, ధర్మేందర్ నాయక్, ఠాకూర్, రాము నాయక్, చండీయా, యూత్ కాంగ్రెస్ నాయకులు వాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.