దళిత సాధికారత ఓ బూటకం: మందకృష్ణ

దిశ, జమ్మికుంట: ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా దళిత సాధికారత అనే పేరుతో ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అదంతా బూటకమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. శుక్రవారం జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మందకృష్ణ మాదిగ.. హైటెక్ సిటీలో దళితులకు ఐదు ఎకరాల భూమి, భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితులను ఓట్లు అడిగే […]

Update: 2021-07-16 08:18 GMT

దిశ, జమ్మికుంట: ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా దళిత సాధికారత అనే పేరుతో ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అదంతా బూటకమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. శుక్రవారం జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మందకృష్ణ మాదిగ.. హైటెక్ సిటీలో దళితులకు ఐదు ఎకరాల భూమి, భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితులను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. హైటెక్ సిటీలో అగ్రవర్ణాలకు 5, 10 ఎకరాల చొప్పున భూమి కేటాయించారని, భవన నిర్మాణాల కోసం వందల కోట్ల నిధులు ఇస్తామని చెప్పారని, కానీ దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు జరిగే అన్యాయంపై త్వరలోనే దొరల పాలనకు చమరగీతం పాడాలని.. దొరల రాజ్యం పోయి పేదల రాజ్యం వచ్చేందుకు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    

Similar News