లాన్స్‌నాయక్ ఫిరోజ్‌ఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి

దిశ, న్యూస్‌బ్యూరో: సైనికులకు లేని కుల, మత, ప్రాంత వివక్ష పాలకులు ఎందుకు పాటిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 7రోజుల్లో కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని ఆదుకున్న సీఎం కేసీఆర్.. ఏడేళ్ల కింద వీరమరణం పొందిన లాన్స్ నాయక్, ఫిరోజ్‌ఖాన్ కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై మందకృష్ణ మాదిగ మంగళవారం ఓ ప్రకటన చేశారు. కల్నల్ సంతోష్‌బాబు కుంటుబాన్ని పరామర్శించి రూ.5కోట్లు ఆర్థికసాయం అందించిన సీఎంను అభినందించిన […]

Update: 2020-06-23 10:57 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: సైనికులకు లేని కుల, మత, ప్రాంత వివక్ష పాలకులు ఎందుకు పాటిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 7రోజుల్లో కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని ఆదుకున్న సీఎం కేసీఆర్.. ఏడేళ్ల కింద వీరమరణం పొందిన లాన్స్ నాయక్, ఫిరోజ్‌ఖాన్ కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై మందకృష్ణ మాదిగ మంగళవారం ఓ ప్రకటన చేశారు. కల్నల్ సంతోష్‌బాబు కుంటుబాన్ని పరామర్శించి రూ.5కోట్లు ఆర్థికసాయం అందించిన సీఎంను అభినందించిన మందకృష్ణ మాదిగ.. ఇదే తరహాలో ఇతర సైనికులు వీరమరణం పొందినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. 2013లో ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో వీరమరణం పొందిన సైనికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 93ప్రకారం రూ.30లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

Tags:    

Similar News