అధైర్య పడకండి.. మీ వారిని నేను విడివిస్తా : ఎమ్మెల్యే రసమయి
దిశ, ఇల్లంతకుంట : గల్ఫ్ బాధిత కుటుంబాలకు అండగా నేనున్నానని.. అధైర్య పడవద్దని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బాధిత కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపారు. మండలంలోని దాచారం గ్రామానికి చెందిన శ్రీరాముల రవీందర్, కంచె రవీందర్‌లు బతుకు దెరువు కోసం పొట్ట చేతపట్టుకుని దుబాయ్ వెళ్లగా ఏజెంట్ చేసిన మోసం కారణంగా అక్కడ జైలు జీవితం గడుపుతూ నరకయాతన పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి కుటుంబ సభ్యులు రసమయిని కలిసి వారి గోడును విన్నపించుకున్నారు. […]
దిశ, ఇల్లంతకుంట : గల్ఫ్ బాధిత కుటుంబాలకు అండగా నేనున్నానని.. అధైర్య పడవద్దని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బాధిత కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపారు. మండలంలోని దాచారం గ్రామానికి చెందిన శ్రీరాముల రవీందర్, కంచె రవీందర్‌లు బతుకు దెరువు కోసం పొట్ట చేతపట్టుకుని దుబాయ్ వెళ్లగా ఏజెంట్ చేసిన మోసం కారణంగా అక్కడ జైలు జీవితం గడుపుతూ నరకయాతన పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి కుటుంబ సభ్యులు రసమయిని కలిసి వారి గోడును విన్నపించుకున్నారు. వెంటనే స్పందించిన రసమయి దుబాయ్ అడ్వకేట్ అనురాధ, ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి వారిని తొందరగా ఇండియాకు వచ్చేలా చూస్తానని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులు త్వరగా ఇంటికి వచ్చేలా కృషి చేస్తానన్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. రసమయిని కలిసిన వారిలో గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు రమ దేవేంద్రలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.