SBIలో మేనేజర్‌ జాబ్స్‌.. బీఈ, బీటెక్, ఎంబీఏ అర్హతలు!

దిశ, వెబ్‌డెస్క్ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI) ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి ఆసక్తి,, అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ముంబై కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://bank.sbi/careers వెబ్‌సైట్‌ను […]

Update: 2021-01-27 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI) ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి ఆసక్తి,, అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ముంబై కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://bank.sbi/careers వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరింది. పోస్టు పేరు : మేనేజర్‌ (రిటైల్‌ ప్రొడక్ట్స్‌)

అర్హత : MBA, PGDM, BE, B Tech పూర్తి చేసి ఉండాలి. అయితే, సంబంధిత పోస్టుకు ఇదివరకు పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఎంపిక ప్రక్రియ : దరఖాస్తు చేసుకున్నవారి విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి అభ్యర్థులను ఎంపిక చేసి, ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేయాలి. దరఖాస్తు రుసుము : రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 12గా నిర్ణయించారు. వివరాలకు వెబ్‌సైట్‌ : https://bank.sbi/careers చూడొచ్చు.

Tags:    

Similar News