ఫిల్టర్’ మాదిరి కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ..వ్యక్తిపై నెటిజన్లు ఫైర్

దిశ, ఫీచర్స్: ప్రజెంట్ e-జనరేషన్ వారి జీవితంలోని ప్రతీ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఎవ్రీ మినట్ అప్‌డేట్ అవుతూ, నూతన ఫీచర్లను యూజ్ చేస్తూ డైలీ నూతన విషయాలపై పోస్టులు పెడుతుంటారు. బ్యాక్‌గ్రౌండ్ లుక్‌తో పాటు అందంగా కనిపించేందు ఇన్ స్టా గ్రామ్ ‘ఫిల్టర్’ ఫీచర్ తీసుకు‌రాగా అది చూసి ఓ వ్యక్తి ముఖం కాల్చుకున్నాడు. అదెంటీ ముఖం కాల్చుకోవడమేంటి? అనుకుంటున్నారా? అవును..నిజమే..ఆ ఫీచర్ మాదిరిగా తాను ఒరిజినల్‌గా కనిపించాలని రూ.30 లక్షలు ఖర్చు చేసి […]

Update: 2021-03-18 00:06 GMT

దిశ, ఫీచర్స్: ప్రజెంట్ e-జనరేషన్ వారి జీవితంలోని ప్రతీ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఎవ్రీ మినట్ అప్‌డేట్ అవుతూ, నూతన ఫీచర్లను యూజ్ చేస్తూ డైలీ నూతన విషయాలపై పోస్టులు పెడుతుంటారు. బ్యాక్‌గ్రౌండ్ లుక్‌తో పాటు అందంగా కనిపించేందు ఇన్ స్టా గ్రామ్ ‘ఫిల్టర్’ ఫీచర్ తీసుకు‌రాగా అది చూసి ఓ వ్యక్తి ముఖం కాల్చుకున్నాడు. అదెంటీ ముఖం కాల్చుకోవడమేంటి? అనుకుంటున్నారా? అవును..నిజమే..ఆ ఫీచర్ మాదిరిగా తాను ఒరిజినల్‌గా కనిపించాలని రూ.30 లక్షలు ఖర్చు చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. కాగా అందంగా కనిపించడం కోసం హెల్త్ రిస్క్ చేయడం అవసరమా? ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తూ నెటిజన్లు ఆ వ్యక్తిని ట్రోల్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన లెవి జెడ్ ముర్ఫి మోడల్. ‘ఓన్లీ ఫ్యాన్స్’ పేరుతో అకౌంట్ రన్ చేస్తుంటాడు. అభిమానులకు నూతన విషయాలపై వివరిస్తూ ట్రెండీ టాపిక్స్ డిస్కస్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇన్ స్టా ‘ఫిల్టర్’ ఫీచర్ వాడుతూ అందమైన ఇమేజెస్ షేర్ చేస్తుంటాడు. కాగా ఒరిజినల్‌గా అందంగా కనిపించాలన్న ఉద్దేశంతో 19 ఏళ్ల వయసులోనే కాస్మోటిక్స్ వాడటం ప్రారంభించాడు అయినా అనుకున్నంత ఎఫెక్ట్ రావడం లేదని భావించాడు. ప్రతీసారి ‘ఫిల్టర్’ ఫీచర్ వాడటమెందుకు? మనం ఒరిజినల్‌గా అలా ఉంటే బాగుంటుందని భావించాడు. అంతే..ఇటీవల లిప్స్, చీక్స్, చిన్, జా(దవడ), కళ్లు ..ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడంతో పాటు టీత్ స్ట్రేటెనింగ్ చేయించుకున్నాడు. ‘హ్యాపిలి లివ్ విత్ ద ఫేస్’ క్యాప్షన్‌తో సర్జరీ అనంతర ఫొటోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. అందంగా కనిపించాలంటే మొదలు ప్రాణాలు ఉండాలని సూచిస్తున్నారు. అందం కోసం అంతగా తాపత్రయపడొద్దని కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News