పెంపుడు కుక్క పంచాయి‘‘తీ’’.. ప్రాణం తీసింది

దిశ, వెబ్‌డెస్క్: పెంపుడు కుక్క విషయమై పక్కపక్క ఇళ్లలో నివాసం ఉండే వారికి ఘర్షణ జరిగి నిండు ప్రాణం పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పదం జోగులు, కోరం వీరస్వామి పక్క పక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇదేక్రమంలో జోగులుకు చెందిన పెంపుడు కుక్క ప్రతిరోజు వీరస్వామి ఇంటికి వెళ్లి పాత్రలు నాకడం, మూత్ర విసర్జన చేస్తుండటంతో యజమానికి విషయం చెప్పాడు. ఈసారి […]

Update: 2020-08-11 08:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెంపుడు కుక్క విషయమై పక్కపక్క ఇళ్లలో నివాసం ఉండే వారికి ఘర్షణ జరిగి నిండు ప్రాణం పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పదం జోగులు, కోరం వీరస్వామి పక్క పక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇదేక్రమంలో జోగులుకు చెందిన పెంపుడు కుక్క ప్రతిరోజు వీరస్వామి ఇంటికి వెళ్లి పాత్రలు నాకడం, మూత్ర విసర్జన చేస్తుండటంతో యజమానికి విషయం చెప్పాడు. ఈసారి నుంచి కుక్కను రానివ్వమని చెప్పారు. కానీ పదే పదే కుక్క ఇంటికి వస్తుండటంతో సోమవారం సాయంత్రం వీరాస్వామి భార్య కర్రతో కొట్టింది. అది పెద్దగా అరుస్తూ యజమాని ఇంటికి వెళ్లింది.

ఇదేక్రమంలో తమ పెంపుడు కుక్కను కొట్టడంపై ఆగ్రహానికి గురైన జోగులు, ఆయన భార్య ఇద్దరూ కలిసి వీరస్వామి భార్యపై దాడి చేశారు. కొద్దిసేపటికి ఇంటికొచ్చిన వీరస్వామికి ఆయన భార్య విషయం చెప్పడంతో జోగులు కుటుంబం, వీరస్వామి కుటుంబానికి ఘర్షణ జరిగింది. వీరస్వామి తన చేతిలో ఉన్న కర్రతో జోగులును కొట్టడంతో తీవ్రం గాయం కాగా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News