మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఇంట్లో మొండెం.. మరి తల?

దిశ ఏపీ బ్యూరో: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 20వ తేదీన చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే… యర్రగుంట్లకు చెందిన ఐసీఎల్ రిటైర్డ్‌ ఉద్యోగి వెంకట రమణయ్య స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారు. పదవీ విరమణ తరువాత వచ్చిన మొత్తాన్ని చాలా మందికి అప్పులు ఇచ్చారు. అలాగే కడప జిల్లా రాజకీయ నాయకుడు ఆదినారాయణ రెడ్డి అనుచరుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ ముసలయ్యకు కూడా భారీ ఎత్తున […]

Update: 2020-06-24 04:36 GMT

దిశ ఏపీ బ్యూరో: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 20వ తేదీన చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే… యర్రగుంట్లకు చెందిన ఐసీఎల్ రిటైర్డ్‌ ఉద్యోగి వెంకట రమణయ్య స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారు. పదవీ విరమణ తరువాత వచ్చిన మొత్తాన్ని చాలా మందికి అప్పులు ఇచ్చారు. అలాగే కడప జిల్లా రాజకీయ నాయకుడు ఆదినారాయణ రెడ్డి అనుచరుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ ముసలయ్యకు కూడా భారీ ఎత్తున అప్పు ఇచ్చారు.

దీంతో వారి మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి వెంకటరమణయ్య కనిపించకుండా పోయారు. దీంతో ఆమె కుమార్తె తన తండ్రి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నేడు యర్రగుంట్లలోని గువ్వల చెరువు ఘాట్ వద్ద టిఫిన్ బాక్సులో తల ఉందని ఫిర్యాదు రావడంతో దానిని వెంకట రమణయ్య తలగా నిర్ధారించారు. అనంతరం ముసలయ్యను పిలిచి దీనిపై విచారించగా… వెంకటరమణయ్యను కిడ్నాప్ చేసి, హతమార్చి అతని తలను టిఫిన్ బాక్సులో పెట్టి లోయలో పడేసినట్టు తెలిపారు. మొండాన్ని ఆయన ఇంట్లోని సంపులో గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News