పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన గ్రామస్తులు.. పరిస్థితి ఉద్రిక్తం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని శాంతాపూర్ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ గ్రామస్తుడిని విచక్షణా రహితంగా కొట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీపావళి పండుగరోజు గురువారం మండలంలోని శాంతాపూర్ గ్రామంలో పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారని పలువురిని పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారు. దీంతో వారిలో ఓ యువకుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ కావడంతో […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని శాంతాపూర్ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ గ్రామస్తుడిని విచక్షణా రహితంగా కొట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీపావళి పండుగరోజు గురువారం మండలంలోని శాంతాపూర్ గ్రామంలో పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారని పలువురిని పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారు. దీంతో వారిలో ఓ యువకుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ కావడంతో వెంటనే అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో శాంతాపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బిచ్కుంద పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. తమ గ్రామస్తులు పేకాట ఆడకున్న కూడా కావాలనే పోలీసులు వారిని కొట్టారని, ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కాసేపు బిచ్కుంద పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.