యువతి మెడలో తాళికట్టడానికి ప్రయత్నించిన యువకుడు.. కుదరకపోయేసరికి

దిశ, వెబ్ డెస్క్: సమాజంలో ఆడవారి పై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మృగాళ్ల కోరికలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా తనను ప్రేమించడం లేదని కిరాతకంగా ఒక యువతిని కత్తితో పొడిచి చంపాడు ఒక ప్రేమోన్మాది. ఈ దారుణమైన ఘటన కర్ణాటక జిల్లాలోని శిరా తాలూకాలోని దొడ్డగుళలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..రత్నసంద్ర గొల్లరహట్టికి చెందిన పీయూసీ విద్యార్థిని కావ్య ను గత కొంత కాలంగా ఈరన్న అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. యువతి నువ్వంటే […]

Update: 2021-04-05 23:43 GMT

దిశ, వెబ్ డెస్క్: సమాజంలో ఆడవారి పై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మృగాళ్ల కోరికలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా తనను ప్రేమించడం లేదని కిరాతకంగా ఒక యువతిని కత్తితో పొడిచి చంపాడు ఒక ప్రేమోన్మాది. ఈ దారుణమైన ఘటన కర్ణాటక జిల్లాలోని శిరా తాలూకాలోని దొడ్డగుళలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..రత్నసంద్ర గొల్లరహట్టికి చెందిన పీయూసీ విద్యార్థిని కావ్య ను గత కొంత కాలంగా ఈరన్న అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.

యువతి నువ్వంటే నాకిష్టం లేదు, నన్ను వదిలేయ్ అంటూ ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆమెపై నిందితుడు పగను పెంచుకున్నాడు. ఎలాగైనా ఆ యువతిని దక్కించుకోవాలని చూశాడు. సోమవారం కావ్య కాలేజీకి వెళ్తుండగా దారి మధ్యలో ఆపి బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నించాడు. ఆ యువతి తప్పించుకోవడానికి ప్రయత్నించగా ముందే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడి లో కావ్య అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలిస్లు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News