కరోనా వార్త.. గుండెపోటుతో మృతి
దిశ, వెబ్‌డెస్క్: తన భార్యకు కరోనా సోకిందన్న వార్త విన్న భర్త గుండె పోటుతో మరణించాడు. భర్త మరణ వార్త విన్న భార్యకు ఆయన అంత్య క్రియలు దగ్గరుండి చేయించడం కఠినతరం అయింది. దగ్గరి బంధువులు కూడా ఎవ్వరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ చొరవతో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇదే గ్రామంలో పరమానందం దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, […]
దిశ, వెబ్‌డెస్క్: తన భార్యకు కరోనా సోకిందన్న వార్త విన్న భర్త గుండె పోటుతో మరణించాడు. భర్త మరణ వార్త విన్న భార్యకు ఆయన అంత్య క్రియలు దగ్గరుండి చేయించడం కఠినతరం అయింది. దగ్గరి బంధువులు కూడా ఎవ్వరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ చొరవతో అతడి అంత్యక్రియలు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇదే గ్రామంలో పరమానందం దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, భార్యకు కరోనా లక్షణాలు ఉండడంతో ఈ రోజు మండలంలోని పీహెచ్‌సీకి వెళ్లి రాపిడ్ టెస్టు చేయించుకుంది. రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అదే విషయం భర్త పరమానందంకు(50) తెలిపింది. ఈ వార్త ఒక్క అతడు ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. అయితే, అతడి అంత్యక్రియలకు కరోనా అడ్డుగా రావడంతో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇదే సమయంలో గ్రామ సర్పంచ్ లావణ్య నర్సయ్య దగ్గరుండి అతడి అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం.