జనరల్ ఆసుపత్రిలో.. ఉరేసుకుని వ్యక్తి అత్మహత్య

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి అత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం మధ్యహ్నం జరిగింది. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్‌ల వివరాల ప్రకారం… నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన బాలజీ రాజు పవార్(25) పోక్సో కేసులో నిందితుడు. ఫిబ్రవరిలో బాన్సువాడకు చెందిన మైనర్ బాలికకు మాయామాటలు చెప్పి కిడ్నాప్ చేసి మహరాష్ర్టలోని నాసీక్‌లో ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డారు. అతడి చెరనుంచి తప్పించుకు వచ్చిన బాలిక బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. […]

Update: 2020-07-16 08:27 GMT

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి అత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం మధ్యహ్నం జరిగింది. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్‌ల వివరాల ప్రకారం… నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన బాలజీ రాజు పవార్(25) పోక్సో కేసులో నిందితుడు. ఫిబ్రవరిలో బాన్సువాడకు చెందిన మైనర్ బాలికకు మాయామాటలు చెప్పి కిడ్నాప్ చేసి మహరాష్ర్టలోని నాసీక్‌లో ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డారు. అతడి చెరనుంచి తప్పించుకు వచ్చిన బాలిక బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితున్ని చేసి బుధవారం ఎల్లారెడ్డి జూనియర్ ప్రధమ శ్రేణి న్యాయ స్థానంలో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు. అతడిని జైలుకు తరలించే ముందు జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించారు. అక్కడ ఐసోలేషన్ వార్డులో ఉంచి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. అక్కడినుంచి గురువారం పోలీస్‌లు బాలజీని జైలుకు తరలించేందుకు ఆసుపత్రికి ఐసోలేషన్ వార్డు వెతకగా, కిటికికీ ఉరి వేసుకుని చనిపోయాడు. తాను చేసిన నేరం కారణంగా జైలుకు వెళ్లడం ఖాయమని భావించే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News