ఎస్పీ ఆఫీస్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
దిశ, ఏపీ బ్యూరో: పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఎస్పీ కార్యాలయం ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన షేక్ సత్తార్ కుమార్తెపై అత్యాచారయత్నం జరిగింది. జూలై 26న నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వైసీపీ నేతల అండతో కేసు వాపస్ తీసుకోవాలని నిందితులు ఒత్తిడి చేస్తున్నారు. ఇదే క్రమంలో […]
దిశ, ఏపీ బ్యూరో: పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఎస్పీ కార్యాలయం ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన షేక్ సత్తార్ కుమార్తెపై అత్యాచారయత్నం జరిగింది. జూలై 26న నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వైసీపీ నేతల అండతో కేసు వాపస్ తీసుకోవాలని నిందితులు ఒత్తిడి చేస్తున్నారు. ఇదే క్రమంలో తరచూ పోలీసులు స్టేషన్‌కు పిలుస్తుండటంతో విసిగిపోయిన సత్తార్… ఈనెల 1న రాత్రి రాజమండ్రి అర్బన్ ఎస్పీ ఆఫీస్ వద్ద పురుగుల మందు తాగాడు.
ఈ ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, గుంటూరుకు చెందిన మహ్మద్ నజీర్, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండీ హిదాయత్, పార్టీ రాష్ర్ట కార్యదర్శి మహ్మద్ నజీర్ సోమవారం బాధిత కుటుంబాన్ని కలవనున్నారు. అసలేం జరిగిదందనే వివరాలతో కూడిన నివేదికను చంద్రబాబుకు నివేదిస్తారు.