షాకింగ్ ఘటన.. నెలమీద నిలబడ్డ వ్యక్తి మెడకు ఉరి..!
దిశ, గజ్వేల్: తాగుడుకు బానిసై అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రంగకృష్ణ కథనం మేరకు.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్.అండ్.ఆర్ కాలనీ బహిలింపూర్కు చెందిన గొల్లపల్లి చంద్రయ్య (40) గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసైన చంద్రయ్య ఆరోగ్యం దెబ్బతింది. ఇటీవల కాలంలో అనారోగ్యం, మానసికంగా బాధపడుతున్నాడని కొడుకు […]
దిశ, గజ్వేల్: తాగుడుకు బానిసై అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రంగకృష్ణ కథనం మేరకు.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్.అండ్.ఆర్ కాలనీ బహిలింపూర్కు చెందిన గొల్లపల్లి చంద్రయ్య (40) గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసైన చంద్రయ్య ఆరోగ్యం దెబ్బతింది. ఇటీవల కాలంలో అనారోగ్యం, మానసికంగా బాధపడుతున్నాడని కొడుకు భరత్ తెలిపారన్నారు. కుటుంబ సభ్యులు ఇంటివద్ద లేని సమయంలో సోమవారం సాయంత్రం సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్లిన చంద్రయ్య ఎంతకీ తిరిగిరాలేదు. దీంతో ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా బహిలింపూర్ సమీపంలోని ఓ చెట్టుకు ఊరేసుకుని విగతజీవిగా కనిపించాడని స్థానికులు కొడుకు భరత్‌కి సమాచారం ఇచ్చినట్టు ఎస్సై వివరించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు.