ఆసుపత్రిలో కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య .. ఎందుకో తెలుసా?
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కరోనా సోకిన వ్యక్తి నిజామాబాద్ ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేద్రంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ రోజు తెల్లవారు జామున కరోనా ఆసుపత్రి భవనంపై నుంచి దూకడంతో అతని వెన్నుముక విరిగి తీవ్ర రక్తశ్రావము కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కరోనా సోకిన వ్యక్తి నిజామాబాద్ ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేద్రంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ రోజు తెల్లవారు జామున కరోనా ఆసుపత్రి భవనంపై నుంచి దూకడంతో అతని వెన్నుముక విరిగి తీవ్ర రక్తశ్రావము కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి (40) సంవత్సరాల పై బడి ఉంటాడని అతనికి సంబంధిచి పూర్తి వివరాలు తెలిసి రాలేదు. అయితే కరోనా సోకడంతో ధైర్యం కోల్పోయి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.