ఆ కానిస్టేబుల్ పైసల్ గుంజుకుండు.. నిజామాబాద్‌లో యువకుడి హల్‌చల్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఓ పోలీస్ కానిస్టేబుల్ తన వద్ద రూ. 2 వేలు బలవంతంగా లాక్కున్నాడని, ఆరోపిస్తూ ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ సంఘటన నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. త్రీ టౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యాదగిరి శనివారం రాత్రి తన నుంచి డబ్బులు తీసుకొని ఎంతకీ ఇవ్వలేదని.. అందుకే హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని రవీందర్ చెప్పుకొచ్చాడు. ఇది […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఓ పోలీస్ కానిస్టేబుల్ తన వద్ద రూ. 2 వేలు బలవంతంగా లాక్కున్నాడని, ఆరోపిస్తూ ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ సంఘటన నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. త్రీ టౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యాదగిరి శనివారం రాత్రి తన నుంచి డబ్బులు తీసుకొని ఎంతకీ ఇవ్వలేదని.. అందుకే హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని రవీందర్ చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన స్థానిక పోలీసులు అతడికి రూ. 2 వేలు ఇస్తామని నచ్చజెప్పి కిందకు దించారు. ఆ తర్వాత రెండు వేలు ఇవ్వాలని పట్టుబట్టాడు. ఇదే సమయంలో సదరు యువకుడి తల్లి వచ్చి సముదాయించిన ఎంతకీ వినలేదు. దీంతో పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాగిన మైకంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. కానీ, సదరు యువకుడు మాత్రం కానిస్టేబుల్ యాదగిరి డబ్బులు తీసుకున్నాడని పదే పదే ఆరోపించడం గమనార్హం.