కూకట్‌పల్లిలో విస్తృత తనిఖీలు.. గంజాయి విక్రయిస్తోన్న వ్యక్తి అరెస్ట్

దిశ, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి సర్కిల్‌లోని ఎల్లమ్మబండలో గంజాయి విక్రయిస్తోన్న ఓ వ్యక్తిని బుధవారం బాలానగర్​ఎక్సైజ్​పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కుమార్ వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ సిక్కు కాలనీలో నివాసం ఉంటున్న టాంక్ జగత్​సింగ్(37) గంజాయి విక్రయిస్తున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్​పోలీసులు బుధవారం అతని ఇంటిపై దాడులు జరిపారు. ఈ సదర్భంగా 2.1 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జగత్‌ను అదుపులో తీసుకొని విచారించగా నాందేడ్​నుంచి గంజాయి తీసుకొచ్చి […]

Update: 2021-10-27 09:49 GMT

దిశ, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి సర్కిల్‌లోని ఎల్లమ్మబండలో గంజాయి విక్రయిస్తోన్న ఓ వ్యక్తిని బుధవారం బాలానగర్​ఎక్సైజ్​పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కుమార్ వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ సిక్కు కాలనీలో నివాసం ఉంటున్న టాంక్ జగత్​సింగ్(37) గంజాయి విక్రయిస్తున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్​పోలీసులు బుధవారం అతని ఇంటిపై దాడులు జరిపారు. ఈ సదర్భంగా 2.1 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జగత్‌ను అదుపులో తీసుకొని విచారించగా నాందేడ్​నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు నేరం అంగీకరించాడు. దీంతో నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు జీవన్ కుమాన్ తెలిపారు. దాడిలో ఎక్సైజ్ ఎస్ఐలు జశ్వంత్, మహేందర్, సిబ్బంది శ్రీనివాస్, బాలరాజు, రాంచందర్, సురేందర్, పద్మ, భార్గవి, శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.

Tags:    

Similar News