గుంటూరులో కీచకుడు..

ఇంట్లో పనులు చేయాలనే సాకుతో తన భార్య చెల్లిని నిత్యం ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఎవరికైనా చెబితే మీ అక్క జీవితాన్ని నాశనం చేస్తానంటూ బెదిరించేవాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎనిమిదేళ్లుగా ఇదే తంతు. ఈ నరకాన్ని భరించలేని బాధితురాలు ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకివచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరుకు చెందిన రవికిరణ్‌కు అదే గ్రామానికి చెందిన ఓ […]

Update: 2020-02-21 08:50 GMT

ఇంట్లో పనులు చేయాలనే సాకుతో తన భార్య చెల్లిని నిత్యం ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఎవరికైనా చెబితే మీ అక్క జీవితాన్ని నాశనం చేస్తానంటూ బెదిరించేవాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎనిమిదేళ్లుగా ఇదే తంతు. ఈ నరకాన్ని భరించలేని బాధితురాలు ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకివచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరుకు చెందిన రవికిరణ్‌కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో 2010లో వివాహం జరిగింది. ఆ మహిళకు ఓ చెల్లెలు ఉంది. వారి పెళ్లి నాటికి ఆమె వయసు 15 ఏళ్లు. పెళ్లైన కొన్నాళ్లకే నిందితుడి భార్య అనారోగ్యానికి గురవడంతో, రవికిరణ్‌ కన్ను ఆమె సోదరిపై పడింది.

దీంతో ఇంట్లో పనులు చేయాలనే సాకుతో ఆ యువతిని తరచూ ఇంటికి తీసుకెళ్లి, లైంగికంగా వేధించేవాడు. ఎవరికైనా చెబితే మీ అక్క జీవితాన్ని నాశనం చేస్తానంటూ బెదిరించేవాడు. దాంతో ఆ యువతి మౌనంగా భరిస్తూ వచ్చింది. అలా ఎనిమిదేళ్ల పాటు నరకం చూపించిన రవికిరణ్.. 2018లో తమిళనాడులోని ఓ గుడికి తీసుకెళ్లి బలవంతంగా తాళికట్టాడు. కొన్నిరోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని యువతితో చెప్పించాడు. అయితే, వారి పెళ్లి తర్వాత రవికిరణ్ వేధింపులు మరింత పెరిగాయి. అనారోగ్యంతో ఉన్న తన భార్యనూ కొట్టడం ప్రారంభించాడు. ఈ వేధింపులను తట్టుకోలేక సదరు యువతి పుట్టింటికి వెళ్లింది. అనంతరం ఆ యువతికి వేరే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న రవికిరణ్.. అత్తింటి వారితో గొడవపెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా, బాధితురాలి వ్యక్తిగత ఫోటోలను రహస్యంగా చిత్రీకరించి.. వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దాంతో సహనం నశించిన ఆ యువతి.. గుంటూరు రూరల్‌ ఎస్పీ స్పందన కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రవికిరణ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags:    

Similar News