మూడోసారి సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణం చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీనికి ముందు ఉదయం ఆమె సీఎంగా రాజీనామాను గవర్నర్‌కు అందజేశారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది విడతలుగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. మమత సారథ్యంలో తృణమూల్ అపూర్వ విజయాన్ని నమోదుచేసుకున్నప్పటికీ ఆమె నందిగ్రామ్ నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయారు. పార్టీ […]
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణం చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీనికి ముందు ఉదయం ఆమె సీఎంగా రాజీనామాను గవర్నర్‌కు అందజేశారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది విడతలుగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. మమత సారథ్యంలో తృణమూల్ అపూర్వ విజయాన్ని నమోదుచేసుకున్నప్పటికీ ఆమె నందిగ్రామ్ నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయారు. పార్టీ కొత్త ఎమ్మెల్యేలందరూ సోమవారం సమావేశమై శాసనసభా పక్ష నేతగా మమతా బెనర్జీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. 2011లో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన దీదీ, తాజాగా మూడోసారి ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. కాగా, అతి తక్కువగా 67 మంది అతిథుల నడుమ దీదీ ప్రమాణ స్వీకారం చేయగా.. ప్రత్యేక అతిథిగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ హాజరయ్యారు.