టీఆర్ఎస్ గుండెల్లో దడ మొదలైంది : మల్లు రవి

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంద్రవెల్లి సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో దడ పుట్టిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కొత్తదేమీ కాదని, గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడిన భాషేనని, కొత్తగా టీఆర్ఎస్ నాయకులు భాష గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు క్షమాపణ […]

Update: 2021-08-11 04:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంద్రవెల్లి సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో దడ పుట్టిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కొత్తదేమీ కాదని, గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడిన భాషేనని, కొత్తగా టీఆర్ఎస్ నాయకులు భాష గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, కాంగ్రెస్ ఎప్పుడూ అండగానే ఉందని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ఇంద్రవెల్లి సభ కురుక్షేత్ర పోరాటంలో మొదటి రోజులాంటిదని ఇంకా యుద్ధం మిగిలే ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని బయటపెట్టి జైలుకు పంపుతామని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, చరణ్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News