గాంధీ భవన్‌కు రోశయ్య భౌతికకాయం.. నివాళులర్పించిన మల్లికార్జున్ ఖర్గే

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి ఆదివారం ఉదయం గాంధీ భవన్‌కు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దూతగా రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే గాంధీభవన్‌కు చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల నినాదాల నడుమ రోశయ్య భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి. రాజకీయాల్లోకి వచ్చినప్పటి […]

Update: 2021-12-05 02:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి ఆదివారం ఉదయం గాంధీ భవన్‌కు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దూతగా రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే గాంధీభవన్‌కు చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల నినాదాల నడుమ రోశయ్య భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు.

పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని మాత్రమే చివరి శ్వాసవరకూ అంటిపెట్టుకుని ఉన్న రోశయ్య జ్ఞాపకాలను మల్లికార్జున్ ఖర్గే గుర్తుచేసుకున్నారు. 12వ లోక్‌సభ సభ్యుడిగా నరసరావుపేట నుంచి ఎన్నికైన విషయాన్ని నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్ కృష్ణన్, సంపత్ కుమార్, రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్, వి.హెచ్, కేవీపీ, మహేశ్ కుమార్, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, మల్లు రవి, నిరంజన్, కుమార్ రావ్, తదితరులు నివాళులు అర్పించారు.

దేవరాయాంజల్‌‌లో రోశయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు

Tags:    

Similar News