పంచాయితీ కార్యలయం దగ్ధం.. మందుబాబులే కారణమా?
దిశ,మణుగూరు : పినపాక మండలం మల్లారం పంచాయితీలో పంచాయతీ కార్యాలయం దగ్ధమైన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ కార్యాలయానికి మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిప్పు అంటిచడంవలన ప్రమాదం చోటుచేసకున్నట్టు పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మద్యం మత్తులో మందుబాబులు పంచాయతీ కార్యాలయానికి నిప్పు పెట్టవలసిన అవసరం ఏముందని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే ప్రమాదంపై స్థానిక సర్పంచ్ కొమరం రాధాబాయి ఏడేళ్ల బయ్యారం పోలీస్ […]
దిశ,మణుగూరు : పినపాక మండలం మల్లారం పంచాయితీలో పంచాయతీ కార్యాలయం దగ్ధమైన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ కార్యాలయానికి మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిప్పు అంటిచడంవలన ప్రమాదం చోటుచేసకున్నట్టు పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మద్యం మత్తులో మందుబాబులు పంచాయతీ కార్యాలయానికి నిప్పు పెట్టవలసిన అవసరం ఏముందని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ప్రమాదంపై స్థానిక సర్పంచ్ కొమరం రాధాబాయి ఏడేళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమాద ఘటన యాదృచ్ఛికంగా జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనిపై రాజకీయ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ పలు అనుమానాలకు తెరలేపారు. పోలీసులు విచారణ చేపట్టి పంచాయతీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై నిజాలను వెలికితీసి నిగ్గు తేల్చాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ రికార్డు ధ్వంసం తెరవెనుక వ్యక్తుల పాత్రపై ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పంచాయతీ కార్యాలయం ధ్వంసం వెనక పాత్ర దారులను, సూత్రధారులను గుర్తించి, ప్రభుత్వ కార్యాలయాలపై ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.