పరిహారం ఇస్తేనే పనులు.. అధికారులకు హెచ్చరిక

దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్ వద్ద నిర్మిస్తున్న మల్లన్నసాగర్ అదనపు టీఎంసీ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మల్లన్నసాగర్ అదనపు టీఎంసీ కాల్వలో భూములు కోల్పోతున్న ప్రజలకు పూర్తి నష్టపరిహారం ఇచ్చేంతవరకు పనులు చేయనీయమని హెచ్చరించారు. గత 3 రోజుల నుంచి నిర్మాణ పనులను అడ్డుకుంటున్నప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించకపోవడం శోచనీయమన్నారు. శనివారం మూడోరోజు దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రైతులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొని, రైతుల పక్షాన పోరాటం […]

Update: 2021-12-04 07:15 GMT

దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్ వద్ద నిర్మిస్తున్న మల్లన్నసాగర్ అదనపు టీఎంసీ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మల్లన్నసాగర్ అదనపు టీఎంసీ కాల్వలో భూములు కోల్పోతున్న ప్రజలకు పూర్తి నష్టపరిహారం ఇచ్చేంతవరకు పనులు చేయనీయమని హెచ్చరించారు. గత 3 రోజుల నుంచి నిర్మాణ పనులను అడ్డుకుంటున్నప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించకపోవడం శోచనీయమన్నారు.

శనివారం మూడోరోజు దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రైతులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొని, రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తోగుట సీఐ రవీందర్, ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి వారికి రావాల్సిన పరిహారం 3 లక్షల రూపాయలు, స్ట్రక్చర్ పరిహారం కూడా 40 రోజులలో చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News