తండ్రి చావుతో పోరాడుతున్న చూడటానికి రాలేదు
దిశ, హుస్నాబాద్: కాయకష్టం చేసి అల్లారు ముద్దుగా పెంచిన తండ్రినే.. వృద్ధాప్యం రాగానే తనయులు గాలికొదిలేశారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని శంకర్ నరగ్కు చెందిన పొతు మల్లయ్య(78)ను తన కుమారులు చేరదీయలేదు. దీంతో ఆయన హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డిని ఆశ్రయించాడు. స్పందించిన ఆర్డీఓ జూన్ 16వతేదీన వృద్ధుని కుమారులను పిలిపించి మాట్లాడారు. అయిన కొడుకుల ఇంటికి తీసుకెళ్లకపోవడంతో మల్లయ్యను అంకిరెడ్డిపల్లి గ్రామంలోని వృద్ధాశ్రమానికి తరలించారు. కొన్నాళ్లకైనా వారిలో మార్పు వస్తుందేమోనని చూసిన […]
దిశ, హుస్నాబాద్: కాయకష్టం చేసి అల్లారు ముద్దుగా పెంచిన తండ్రినే.. వృద్ధాప్యం రాగానే తనయులు గాలికొదిలేశారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని శంకర్ నరగ్కు చెందిన పొతు మల్లయ్య(78)ను తన కుమారులు చేరదీయలేదు. దీంతో ఆయన హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డిని ఆశ్రయించాడు. స్పందించిన ఆర్డీఓ జూన్ 16వతేదీన వృద్ధుని కుమారులను పిలిపించి మాట్లాడారు. అయిన కొడుకుల ఇంటికి తీసుకెళ్లకపోవడంతో మల్లయ్యను అంకిరెడ్డిపల్లి గ్రామంలోని వృద్ధాశ్రమానికి తరలించారు.
కొన్నాళ్లకైనా వారిలో మార్పు వస్తుందేమోనని చూసిన అధికారులకు ఆశాభంగమే ఎదురైంది. వారిలో నేటికి ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం ఆ వృద్ధుడు సిద్దిపేట ఆసుపత్రిలో చావు బతులకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని..కుమారులకు అధికారులు సమాచారం అందించారు. అయిన అతని కుమారులు ఎవరూ రాకపోవడంతో రెవెన్యూ అధికారులు తలా కొంత డబ్బులు వేసుకోవడమే కాకుండా ఓ రెవెన్యూ అధికారిని ఆసుపత్రిలో ఉంచి ఆ వృద్దుడికి సేవలు చేయడంతో పలువురు అభినందిస్తున్నారు. వృద్ధుడి కొడుకులు పోతు రవీందర్, పోతు జనార్ధన్, పోతు సుధాకర్ ల పేరు మీద ఉన్న భూమి మొత్తాన్ని అసైన్డ్ చేసి తిరిగి వృద్దుడిపై పట్టాలు చేయడమే కాకుండా ముగ్గురి కొడుకులపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ రుక్మిణీ తెలిపారు.