మేక్ ఇన్ ఇండియా కు కేంద్రం ప్రోత్సాహకాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దిశ, ఖైరతాబాద్ : భారత పారిశ్రామిక రంగానికి చేయూతనందించేందుకు మేకిన్ ఇండియా లో భాగంగా అనేక ప్రోత్సాహకాలను మోడీ ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ కు చెందిన జైత్ర డివైస్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన బైపోలార్ క్రిమిసంహారిణి ప్యూరిఫైయర్ డివైస్ ప్రాణా ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎటా 3 నుంచి 4 లక్షల కోట్ల మెడికల్ డిఫెన్స్ […]

Update: 2021-10-24 06:45 GMT

దిశ, ఖైరతాబాద్ : భారత పారిశ్రామిక రంగానికి చేయూతనందించేందుకు మేకిన్ ఇండియా లో భాగంగా అనేక ప్రోత్సాహకాలను మోడీ ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ కు చెందిన జైత్ర డివైస్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన బైపోలార్ క్రిమిసంహారిణి ప్యూరిఫైయర్ డివైస్ ప్రాణా ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎటా 3 నుంచి 4 లక్షల కోట్ల మెడికల్ డిఫెన్స్ తదితర రంగాల డివైజ్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునటునట్లు తెలిపారు.

కరోనా సమయంలో విదేశీ దిగుమతులు తగ్గిన నేపథ్యంలో వాటిని తట్టుకునేందుకు ఏటా 1.5 లక్షల కోట్ల వస్తువులను ఇండియాలో తయారు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం అనేక రంగాలలో ఇండియా సాంకేతికతతో తయారు చేసిన వస్తువులకు రాయితీలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా ఫామ్ ఆయిల్ తయారీ రైతులకు 12 వేల కోట్ల రూపాయలను కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ప్రధానమంత్రి 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి దేశీయ ఉత్పత్తి రంగానికి పెద్దపీట వేశారని అన్నారు.

ప్రపంచం కరోనాతో సమయంలో భారతీయ సాంకేతికతతో తయారుచేసిన వ్యాక్సిన్ ప్రపంచంలోనే అతి ముఖ్యమైనదిగా గుర్తించారని తెలిపారు. మనం తయారు చేసిన వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేందుకు ప్రపంచంలోనే 130 దేశాలు పోటీ పడుతున్నాయని అన్నారు. భారతదేశం సాంకేతికంగా వాణిజ్యపరంగా ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకు ప్రధానమంత్రి మేకిన్ ఇండియా తీర్చిదిద్దారని వెల్లడించారు. ఈ కార్యక్రమ ట్రివి ట్రాస్ హెల్త్ కేర్ గ్రూప్ చైర్మన్ జి.ఎస్.కె వేలు, కిమ్స్ హాస్పిటల్ వ్యవస్థాపకులు భాస్కరరావు, జైత్ర డివైసెస్ కో చైర్మన్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..