ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన మేజ‌ర్ ఎన్ సుప్రియ

దిశ ప్రతినిధి , హైద‌రాబాద్ : స‌రోజినీ వ‌నితా మ‌హా విద్యాల‌యంలో ఎన్‌సీసీ అసోసియేట్ ఆఫీస‌ర్, కామ‌ర్స్ లెక్చర‌ర్‌గా విధులు నిర్వహిస్తున్న మేజ‌ర్ ఎన్ సుప్రియను మ‌హిళా శిరోమ‌ణి అవార్డు – 2021 అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు తెలంగాణ సిటిజెన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయ‌ణ్ ముదిరాజ్ , మ‌హిళా అధ్యక్షురాలు మేజ‌ర్ డి జ‌య‌సుధలు తెలిపారు. ఈ మేర‌కు గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవాన్ని పుర‌స్కరించుకుని ఈ నెల […]

Update: 2021-03-04 07:00 GMT

దిశ ప్రతినిధి , హైద‌రాబాద్ : స‌రోజినీ వ‌నితా మ‌హా విద్యాల‌యంలో ఎన్‌సీసీ అసోసియేట్ ఆఫీస‌ర్, కామ‌ర్స్ లెక్చర‌ర్‌గా విధులు నిర్వహిస్తున్న మేజ‌ర్ ఎన్ సుప్రియను మ‌హిళా శిరోమ‌ణి అవార్డు – 2021 అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు తెలంగాణ సిటిజెన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయ‌ణ్ ముదిరాజ్ , మ‌హిళా అధ్యక్షురాలు మేజ‌ర్ డి జ‌య‌సుధలు తెలిపారు.

ఈ మేర‌కు గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవాన్ని పుర‌స్కరించుకుని ఈ నెల 6వ తేదీ ఉద‌యం బిర్లా మందిర్ భాస్కర ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ, జ‌స్టిస్ టి ర‌జ‌నీ, మాజీ మంత్రి పుష్పలీల, ప్రొఫెస‌ర్ సూర్యధ‌నంజ‌యలు ముఖ్య అతిథులుగా హాజ‌రై అవార్డును ప్రదానం చేయ‌నున్నట్లు వెల్లడించారు. క‌రోనా వ్యాధి నియంత్రణ‌కు, జాతీయ స‌మైక్యత‌కు, శాంతి, మ‌త సామ‌ర‌స్యం, మాదక ద్రవ్యాల‌కు వ్యతిరేకంగా, మ‌హిళా హ‌క్కులు సాధ‌న‌ కోసం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్షణ వంటి వాటిపై ఆమె నిరంత‌రం ప‌ని చేస్తున్నందున అవార్డును బ‌హుక‌రిస్తున్నట్లు వారు వివ‌రించారు.

Tags:    

Similar News