‘మేజర్’ బిగినింగ్స్.. ద లుక్ టెస్ట్

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ హీరో అడవి శేషు తన డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌తో టాలీవుడ్‌కు కొత్తదనాన్ని యాడ్ చేయడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ‘గూఢచారి, క్షణం, ఎవరు’ లాంటి సినిమాలు ఇదే కోవకు చెందగా.. మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘మేజర్’తో ఇండియన్ సిటిజన్స్‌ను ఇన్‌స్పైర్ చేసేందుకు రెడీ అయ్యాడు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మేజర్’ ప్రాజెక్ట్ ఇంతకీ ఎలా స్టార్ట్ అయింది? తన బయోపిక్ తెరకెక్కించాలని సందీప్ తల్లిదండ్రులను కలిసినప్పుడు […]

Update: 2020-11-27 02:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ హీరో అడవి శేషు తన డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌తో టాలీవుడ్‌కు కొత్తదనాన్ని యాడ్ చేయడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ‘గూఢచారి, క్షణం, ఎవరు’ లాంటి సినిమాలు ఇదే కోవకు చెందగా.. మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘మేజర్’తో ఇండియన్ సిటిజన్స్‌ను ఇన్‌స్పైర్ చేసేందుకు రెడీ అయ్యాడు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మేజర్’ ప్రాజెక్ట్ ఇంతకీ ఎలా స్టార్ట్ అయింది? తన బయోపిక్ తెరకెక్కించాలని సందీప్ తల్లిదండ్రులను కలిసినప్పుడు ఏం జరిగింది? చివరికి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయి సెట్స్ వరకు ఎలా వెళ్లిందనే విషయాలను ‘మేజర్ బిగినింగ్స్’ అంటూ ప్రేక్షకులతో పంచుకున్నాడు శేషు.

2008.. 26/11.. ముంబై టెర్రర్ ఎటాక్.. నెక్స్ట్ డే మేజర్ ఉన్నికృష్ణన్ సాహస గాథను ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మీడియా ప్రసారం చేస్తుండగా అమెరికాలో ఉన్న తను చూశానని, మేజర్ ఉన్నికృష్ణన్ కళ్లలో పాషన్.. మ్యాజిక్.. స్పిరిట్.. మ్యాడ్‌నెస్ చూసి, తను ఎవరు ఏంటి? అని తెలుసుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపేవాడినని శేషు చెప్పాడు. తన గురించి ఏ ఆర్టికల్ వచ్చినా సరే చదివి దాచి పెట్టుకునే వాడినని, తన గురించి పూర్తిగా తెలుసుకునేందుకు పదేళ్లు పట్టిందని వెల్లడించాడు. ఈ సమయంలోనే తన ఇండస్ట్రీ ఎంట్రీ కూడా జరిగిపోయిందని తెలిపాడు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ.. తన పేరెంట్స్‌ను కాంటాక్ట్ చేసే ధైర్యం చేయలేకపోయానని చెప్పాడు. మేజర్ లాంటి పాన్ ఇండియా ఫిల్మ్ డీల్ చేయగలననే నమ్మకం వచ్చిన తర్వాత వారిని కాంటాక్ట్ చేసినట్లు తెలిపాడు. అయితే హైదరాబాద్‌లో పుట్టాడు, అమెరికాలో పెరిగాడు.. నా కొడుకు జీవితం తనను ఇన్‌స్పైర్ చేసింది.. సినిమా తీస్తాడా? అని వాళ్లస్సలు నమ్మలేదన్నాడు శేషు. తర్వాత కలుస్తూనే ఉండగా నాలుగోసారి 10 శాతం నమ్మకం వచ్చినట్లు చెప్పారట ఉన్నికృష్ణన్ తండ్రి. ఐదోసారి కలవడానికి వెళ్ళినప్పుడు శేషుని చూసి ‘సందీప్‌లా కనిపిస్తున్నావ్..’ అంటూ కన్నీళ్లు పెట్టుకుందట తల్లి. ఆ క్షణం వారి నుంచి పర్మిషన్ వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అయ్యానని.. కానీ ఆ తర్వాత ఇంత గొప్ప వ్యక్తి జీవితాన్ని ఎలా తెరకెక్కించాలనే భయం పట్టుకుందని చెప్పాడు శేషు. కానీ ‘ఆయన లైఫ్ గురించి ఆలోచిస్తుంటే ఒక ఫిలాసఫీ గుర్తొచ్చింది.. మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం, ఆ పని చేసేటప్పుడు సిన్సియారిటీ.. ఈ రెండు ఉన్నికృష్ణన్ లక్షణాలు కాగా.. వాటినే నమ్ముకుని పని మొదలుపెట్టా’ అని చెప్పుకొచ్చాడు శేషు

తన స్పిరిట్‌ను తనలో తాను వెతుక్కుని మేజర్ సందీప్‌గా ఫస్ట్ ఫొటో దిగానని చెప్పిన శేషు.. ఆ లుక్‌ ను సందీప్ ఐకానిక్ పాస్ ఫొటోతో పోల్చుతూ షేర్ చేశాడు. ఆ ఫొటో చూడగానే ఆడియన్స్‌కు గూస్ బంప్స్ వచ్చాయని చెబుతున్నారు. కేవలం కళ్లు మాత్రమే కనిపించినా ఆ లుక్‌లో ఉన్న మ్యాజికా? లేక మరేదైనా కావచ్చు.. ఆడియన్స్ మాత్రం యాక్సెప్ట్ చేసేశారు. కాగా సందీప్ కళ్లలో ఉన్న అదే పాషన్, స్పిరిట్, మ్యాడ్‌నెస్‌ను చూపించే మేజర్ ఫస్ట్ లుక్‌ను డిసెంబర్ 17న అడవి శేషు బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News