Is She a Sex worker : షాకింగ్.. సెక్స్ వర్కర్ అంటూ నటిపై దాడి

దిశ, సినిమా : బ్రిటిష్ పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ యాక్టర్ ‘డానీ డి’తో స్నేహం చేయడం‌ వల్ల ప్రజలు తనను సెక్స్ వర్కర్‌‌గా భావించారని నటి మహికా శర్మ (Mahika Sharma)  తెలిపింది. ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన తను.. ఈ కారణంగా జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని వెల్లడించింది. సెక్స్ వర్కర్ అంటూ తనపై దాడి చేశారని, వాస్తవమేంటో తెలుసుకోకుండా వివక్ష చూపించారని గుర్తుచేసుకుంది. సమాజంలో అమ్మాయిని అగౌరవపరచడం సులభమే కానీ […]

Update: 2021-06-02 06:32 GMT

దిశ, సినిమా : బ్రిటిష్ పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ యాక్టర్ ‘డానీ డి’తో స్నేహం చేయడం‌ వల్ల ప్రజలు తనను సెక్స్ వర్కర్‌‌గా భావించారని నటి మహికా శర్మ (Mahika Sharma) తెలిపింది. ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన తను.. ఈ కారణంగా జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని వెల్లడించింది. సెక్స్ వర్కర్ అంటూ తనపై దాడి చేశారని, వాస్తవమేంటో తెలుసుకోకుండా వివక్ష చూపించారని గుర్తుచేసుకుంది.

సమాజంలో అమ్మాయిని అగౌరవపరచడం సులభమే కానీ తను మానసికంగా ఎంత కుమిలిపోతుందో అర్థం చేసుకోలేరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు చూశాక సెక్స్ వర్కర్స్ జీవితం ఎంత దయనీయంగా ఉంటుందో తెలుసుకున్నానని, బలంగా ఉండేందుకు ప్రయత్నించానని పేర్కొంది. ఇక ‘రామాయణం’, ‘తు మేరే అగల్ బగల్ హై’ లాంటి సీరియల్స్‌లో నటించిన ఆమె.. ఈ ప్రొఫెషన్‌ను విడిచిపెట్టి సెక్స్ వర్కర్స్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రయత్నించానని వివరించింది.

సెక్స్ వర్కర్స్ ప్రతీ రోజు హింసించబడుతున్నారని, వారిని గౌరవించడంపై అవగాహన కల్పించడం ముఖ్యమని సూచించింది. అయితే మన దేశంలో పోర్న్‌ నిషేధించబడినా, ఇప్పటికీ అడల్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రయత్నించాల్సిన అవసరముందని మహికా శర్మ చెప్పుకొచ్చింది.

Mahika Sharma reveals facing challenges, after people assumed she was a sex worker

Tags:    

Similar News

టైగర్స్ @ 42..