సాహసోపేత యోధులు డాక్టర్లు, పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: రెండు వారాలు లాక్ డౌన్ విజయవంతంగా పూర్తి కావడంపై స్పందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజల రక్షణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోవిడ్ 19తో యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవితాలను పణంగా పెట్టి వీధుల్లో, ఆస్పత్రుల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్న సాహసోపేత యోధులందరికీ ధన్యవాదాలు […]

Update: 2020-04-07 04:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు వారాలు లాక్ డౌన్ విజయవంతంగా పూర్తి కావడంపై స్పందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజల రక్షణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోవిడ్ 19తో యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవితాలను పణంగా పెట్టి వీధుల్లో, ఆస్పత్రుల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్న సాహసోపేత యోధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆకాంక్షించారు.

ఈ క్లిష్ట సమయాల్లో సామాజిక దూరం పాటించడం, శుభ్రంగా ఉండడంతో పాటు మరో విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు మహేష్. అదే భయం అని… భయానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. మనల్ని భయపెట్టే ప్రజలకు, భయాందోళనకు గురిచేసే వార్తలకు దూరంగా ఉండడం శ్రేష్టమన్నారు. తప్పుదోవ పట్టిస్తున్న ఫేక్ న్యూస్‌ను పట్టించుకోకూడదన్నారు. ఈ సందర్భంగా ప్రేమ, నమ్మకం, సానుభూతిని వ్యాప్తి చేయాలని ప్రతీ ఒక్కరిని కోరుతున్నానన్నారు. మనమంతా కలిసి కరోనా మహమ్మారిని జయిద్దామని పిలుపునిచ్చారు ప్రిన్స్.

Tags: Mahesh Babu, Corona Virus, Covid19. Corona, World Health Day

Tags:    

Similar News