Mahesh Babu: అసలైన శ్రీమంతుడు.. సొంత ఊరిలో మహేష్ బాబు వ్యాక్సినేషన్ డ్రైవ్
దిశ, సినిమా: రీల్ లైఫ్‌లో మాత్రమే కాదు రియల్ లైఫ్‌లోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే 1000 మందికి పైగా పిల్లలకు ఫ్రీగా హార్ట్ సర్జరీ చేయించిన ఆయన.. హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్‌తో కలిసి వైద్యఖర్చులు భరించలేని వారికి హెల్ప్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు తన సొంత గ్రామం బుర్రిపాలెంతో పాటు సిద్ధాపురం విలేజ్‌ను దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ.. అసలైన శ్రీమంతుడు అనిపించుకున్నాడు. కాగా ప్రస్తుతం దేశం […]
దిశ, సినిమా: రీల్ లైఫ్‌లో మాత్రమే కాదు రియల్ లైఫ్‌లోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే 1000 మందికి పైగా పిల్లలకు ఫ్రీగా హార్ట్ సర్జరీ చేయించిన ఆయన.. హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్‌తో కలిసి వైద్యఖర్చులు భరించలేని వారికి హెల్ప్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు తన సొంత గ్రామం బుర్రిపాలెంతో పాటు సిద్ధాపురం విలేజ్‌ను దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ.. అసలైన శ్రీమంతుడు అనిపించుకున్నాడు. కాగా ప్రస్తుతం దేశం మొత్తం కొవిడ్‌తో పోరాడుతుండగా.. కరోనా నుంచి సొంత ఊరి ప్రజలను రక్షించేందుకు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తన తండ్రి కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులందరికీ వ్యాక్సిన్ ఇప్పించేందుకు సంకల్పించాడు. బుర్రిపాలెంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుండగా.. మహేష్ అభిమానులు పొగడ్తల్తో, ప్రశంసల వర్షం కురిపిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.