‘కొవిడ్ ఫ్రీ విలేజ్ కంటెస్ట్'.. గ్రామానికి రూ.50లక్షలు

ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టే చర్యలను ప్రోత్సహించే లక్ష్యంతో మహారాష్ట్ర సర్కార్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ మేరకు కొవిడ్-ఫ్రీ విలేజ్ పేరిట ఓ కంటెస్ట్‌ను మహా సర్కార్ నిర్వహించనున్నది. ఈ కంటెస్ట్‌లో భాగంగా ప్రతి రెవెన్యూ డివిజన్‌లో కొవిడ్ మేనేజ్‌మెంట్‌లో మంచి పనితీరును కనబరిచిన గ్రామపంచాయతీలకు అవార్డును అందించనున్నారు. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన గ్రామ పంచాయతీకి రూ.50లక్షలు, రెండవ బహుమతి రూ.25 లక్షలు, మూడవ బహుమతి కింద రూ.15 లక్షలు […]

Update: 2021-06-02 07:57 GMT

ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టే చర్యలను ప్రోత్సహించే లక్ష్యంతో మహారాష్ట్ర సర్కార్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ మేరకు కొవిడ్-ఫ్రీ విలేజ్ పేరిట ఓ కంటెస్ట్‌ను మహా సర్కార్ నిర్వహించనున్నది. ఈ కంటెస్ట్‌లో భాగంగా ప్రతి రెవెన్యూ డివిజన్‌లో కొవిడ్ మేనేజ్‌మెంట్‌లో మంచి పనితీరును కనబరిచిన గ్రామపంచాయతీలకు అవార్డును అందించనున్నారు. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన గ్రామ పంచాయతీకి రూ.50లక్షలు, రెండవ బహుమతి రూ.25 లక్షలు, మూడవ బహుమతి కింద రూ.15 లక్షలు ఇవ్వనున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముషరఫ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయనీ, వాటిలో మొత్తం 18 అవార్డులను అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కంటెస్ట్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన పంచాయతీలకు అవార్డుతో పాటు అంతే విలువ గల నగదును ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News