మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్?.. త్వరలో నిర్ణయమంటూ సీఎం వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధించనున్నారా?.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. శివసేన అధికారిక పత్రిక అయిన సామ్నాలో మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశముందంటూ వచ్చిన ఎడిటోరియల్ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారిక శివసేన అధికారిక పత్రికలోనే వార్త రావడంతో.. త్వరలో మహారాష్ట్రలో లాక్‌డౌన్ తప్పదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా మళ్లీ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంపై స్పందించారు. రానున్న కొద్దిరోజుల్లో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం […]
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధించనున్నారా?.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. శివసేన అధికారిక పత్రిక అయిన సామ్నాలో మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశముందంటూ వచ్చిన ఎడిటోరియల్ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారిక శివసేన అధికారిక పత్రికలోనే వార్త రావడంతో.. త్వరలో మహారాష్ట్రలో లాక్‌డౌన్ తప్పదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా మళ్లీ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంపై స్పందించారు. రానున్న కొద్దిరోజుల్లో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. కరోనాను నివారించేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే లాక్‌డౌన్ తప్పదని ఉద్దవ్ హెచ్చరించారు.
‘లాక్‌డౌన్ ఎవరికీ ఇష్టం ఉండదు. మాకు కూడా ఇష్టం లేదు. ప్రజలకు నిబంధనలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. కానీ ప్రజలు కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరముంది. పాటించకపోతే లాక్‌డౌన్ విధించక తప్పదు. రానున్న కొద్దిరోజుల్లో సెకండ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటాం’ అని ఉద్ధవ్ స్పష్టం చేశారు