ఎట్టిపరిస్థితుల్లో సీబీఐకి బదిలీ చేయం
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఎట్టిపరిస్థితుల్లో సీబీఐకి బదిలీ చేసేది లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మరోసారి స్పష్టం చేశారు. తామే ఈ కేసును విచారిస్తారని ఆయన అన్నారు. ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై […]
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఎట్టిపరిస్థితుల్లో సీబీఐకి బదిలీ చేసేది లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మరోసారి స్పష్టం చేశారు. తామే ఈ కేసును విచారిస్తారని ఆయన అన్నారు.
ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై అతని తండ్రి బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో ఈ కేసును బీహార్ పోలీసులు విచారిస్తున్నారు. ఓ పోలీస్ బృందం ఇప్పటికే ముంబై చేరుకుని విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా సుశాంత్ సోదరి స్టేట్‌మెంట్ రికార్టు కూడా చేసింది.