దిశ ఎఫెక్ట్ : జెండావిష్కణలో నిర్లక్ష్యం.. కలెక్టర్ ఆగ్రహం
దిశ, జడ్చర్ల : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జాతీయ పతాక ఆవిష్కరణ సందర్భంగా మిడ్జిల్ మండల కేంద్రంలో గ్రంథాలయం వద్ద గ్రంథాలయ అధికారి జెండాను అవమానకరంగా ఎగరవేయడం, మహత్మ గాంధీ చిత్రపటానికి గత సంవత్సరం వాడిన పూల దండలనే ఈ సంవత్సరం కూడా వేయటం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యాధికారులు జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయటం, మహిళా […]
దిశ, జడ్చర్ల : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జాతీయ పతాక ఆవిష్కరణ సందర్భంగా మిడ్జిల్ మండల కేంద్రంలో గ్రంథాలయం వద్ద గ్రంథాలయ అధికారి జెండాను అవమానకరంగా ఎగరవేయడం, మహత్మ గాంధీ చిత్రపటానికి గత సంవత్సరం వాడిన పూల దండలనే ఈ సంవత్సరం కూడా వేయటం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యాధికారులు జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేయటం, మహిళా సంఘం వద్ద తలకిందులుగా ఎగరవేయడం, మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద మధ్య వరకే జెండాను ఎగరవేసిన విషయాన్ని దిశ వెలుగులోకి తెచ్చిన విషయం పాఠకులకు విదితమే. ఈ మేరకు కలెక్టర్ స్పందిస్తూ జాతీయ జెండాను ఎగర వేయడంలో నిర్లక్ష్యం వహించిన వారికి ఫ్లాగ్ కోడ్ కింద నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాక సంబంధిత శాఖ అధికారుల వివరణలు కూడా కోరాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.