పేరెంట్స్‌ను అనాథలుగా వదిలేస్తే చర్యలు తప్పవు.. మేజిస్ట్రేట్ వార్నింగ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎల్లారెడ్డి కోర్టు ముందు పాకుతూ వెళుతున్న ఒక వృద్ధురాలిని చూసి మేజిస్ట్రేట్ చలించిపోయారు. ఈ క్రమంలో మేజిస్ట్రేట్ అనిత.. కారు ఆపి ఆమె వద్దకు వెళ్లారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన బాలభాయి(80)కి మేజిస్ట్రేట్ అనిత.. అల్పాహారం అందించి, హెల్త్ చెకప్ చేయించారు. అనంతరం బాలభాయి దీన స్థితికి కారణమైన ఆమె కొడుకులను కోర్టుకు పిలిపించారు. కన్న తల్లిని ఇలా రోడ్డు మీద అనాథగా వదిలేయడంపై మేజిస్ట్రేట్ అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎల్లారెడ్డి కోర్టు ముందు పాకుతూ వెళుతున్న ఒక వృద్ధురాలిని చూసి మేజిస్ట్రేట్ చలించిపోయారు. ఈ క్రమంలో మేజిస్ట్రేట్ అనిత.. కారు ఆపి ఆమె వద్దకు వెళ్లారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన బాలభాయి(80)కి మేజిస్ట్రేట్ అనిత.. అల్పాహారం అందించి, హెల్త్ చెకప్ చేయించారు.
అనంతరం బాలభాయి దీన స్థితికి కారణమైన ఆమె కొడుకులను కోర్టుకు పిలిపించారు. కన్న తల్లిని ఇలా రోడ్డు మీద అనాథగా వదిలేయడంపై మేజిస్ట్రేట్ అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలభాయి.. ఇద్దరు కొడుకులకు, కూతురుకి వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తే, వారిని పట్టించుకోకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనను మేజిస్ట్రేట్ అనిత మొదటి తప్పుగా పరిగణిస్తూ వారికి కౌన్సిలింగ్ చేసి విడిచిపెట్టారు.