ఎన్ఆర్ఏ ఫలితాల ఆధారంగా ఉద్యోగాలు: మధ్యప్రదేశ్ సీఎం
దిశ, వెబ్ డెస్క్: కేంద్రం ప్రకటించిన నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ నిర్వహించే పరీక్ష ఫలితాల ఆధారంగా… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులను నియమించే తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్ అవుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మెజార్టీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఫలితాల ఆధారంగా వివిధ శాఖల్లో ఉద్యోగుల నియమాకం చేపట్టే విధానానికి కేంద్రమంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. తదుపరి రోజే మధ్యప్రదేశ్ ఈ ప్రకటనపై స్పందిస్తూ ఎన్ఆర్ఏ టెస్టు ఫలితాల ఆధారంగా […]
దిశ, వెబ్ డెస్క్: కేంద్రం ప్రకటించిన నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ నిర్వహించే పరీక్ష ఫలితాల ఆధారంగా… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులను నియమించే తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్ అవుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
మెజార్టీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఫలితాల ఆధారంగా వివిధ శాఖల్లో ఉద్యోగుల నియమాకం చేపట్టే విధానానికి కేంద్రమంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. తదుపరి రోజే మధ్యప్రదేశ్ ఈ ప్రకటనపై స్పందిస్తూ ఎన్ఆర్ఏ టెస్టు ఫలితాల ఆధారంగా రాష్ట్ర యువతను ఉద్యోగాల్లో నియమించుకుంటామని వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను స్థానికులకే రిజర్వ్ చేసుకుంటామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.