తాత మధు గెలుపు ఖాయం : మంత్రి పువ్వాడ

దిశ, ఖమ్మం టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో తాత మధు గెలుపు ఖాయం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అన్నారు. ఈ రోజు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాత మధు ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు. తమకు సొంతగానే 500 ఓట్లు పై చిలుకూ ఉన్నాయి అన్నారు. నిన్న జరిగిన పోలింగ్ సరళితో పెద్ద ఎత్తున విజయం సాధించడం కాయం అన్నారు. […]

Update: 2021-12-11 02:36 GMT

దిశ, ఖమ్మం టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో తాత మధు గెలుపు ఖాయం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అన్నారు. ఈ రోజు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాత మధు ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు. తమకు సొంతగానే 500 ఓట్లు పై చిలుకూ ఉన్నాయి అన్నారు. నిన్న జరిగిన పోలింగ్ సరళితో పెద్ద ఎత్తున విజయం సాధించడం కాయం అన్నారు. ధాన్యం సేకరణ, తరలింపు విషయంలో కేంద్రం అవలంభిస్తున్న విధానాన్ని ఎండగట్టారు. ఈ సమావేశంలో ఎంపీ నామ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థ మెజార్టీ స్టేట్ హోల్డర్ అన్నారు. కనీసం మా అనుమతులు తీసుకోకుండా ఒంటెద్దు పోకడ పోతుందని నామ విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుచరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు,కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు.

అదేవిధంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం నియంత్ర పోకడకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థను మాకు ఇవ్వమన్న, ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి‌ని వ్యతిరేకిస్తుంది అన్నారు. 120 సంవత్సరాల సింగరేణి సంస్థ‌ను నిర్వీర్యం చేయడంలో కేంద్ర ప్రభుత్వం ధోరణి సరైంది కాదన్నారు. సింగరేణి పరిరక్షణ ఉద్యమం‌లో మేము మద్దతు ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు మాట్లాడుతూ.. తన గెలుపుకోసం కృషి చేసిన జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ, ఎమ్మెల్యేలు సండ్ర, రాములు నాయక్, కందలా, వనమా, రేగాకాంత రావు, మచ్చ నాగేశ్వరరావు మిగిలిన ప్రజాప్రతినిధులు‌కు అందరికి ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News