పోడు భూముల సర్వేలో ఆలస్యమేలా..? : మద్దిశెట్టి సామేలు
దిశ, అన్నపురెడ్డిపల్లి : పోడు సాగుదారుల సమస్యకు పరిష్కారం చూపడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండటం వలన రైతుల ఇబ్బందులు పడుతున్నారని ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ మద్దిశెట్టి సామేలు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం శాంతినగర్ గ్రామం పెద్దిరెడ్డిగూడెం రెవెన్యూ పరిధిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు జాయింట్ సర్వే నిర్వహించి పట్టా హక్కులు కల్పించాలని పోడు సాగు దారులు సున్నం రాములు, భేతి నాగులు అధ్యక్షతన […]
దిశ, అన్నపురెడ్డిపల్లి : పోడు సాగుదారుల సమస్యకు పరిష్కారం చూపడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండటం వలన రైతుల ఇబ్బందులు పడుతున్నారని ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ మద్దిశెట్టి సామేలు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం శాంతినగర్ గ్రామం పెద్దిరెడ్డిగూడెం రెవెన్యూ పరిధిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు జాయింట్ సర్వే నిర్వహించి పట్టా హక్కులు కల్పించాలని పోడు సాగు దారులు సున్నం రాములు, భేతి నాగులు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా అణగారిన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ మద్దిశెట్టి సామేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి గూడెం రెవెన్యూ పరిధిలో 2005 అటవీ హక్కుల చట్టానికి ముందు నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యకు తక్షణమే పరిష్కరించాలని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం జాయింట్ సర్వే నిర్వహించడంలో అధికారులు జాప్యం వహించడం సబబు కాదన్నారు. ఈ విషయాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా 30 రోజుల్లో పరిష్కరించాలని చెప్పి జిల్లా కలెక్టర్, భద్రాచలం ఐటీడీఏ పీవో, సంబంధిత శాఖ అధికారులకు లేఖలు రాయడం జరిగిందని త్వరలో అధికారులు స్పందించి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.