'మా'లో కలకలం రేపుతున్న హేమ వ్యాఖ్యలు.. నరేష్ ఏమన్నారంటే..?

దిశ, వెబ్‌డెస్క్: మరోసారి ‘మా'(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) లో రగడ మొదలైంది. ఇంకా ఎన్నికలు మొదలు కాకముందే ఒకరి మీద ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటూ మీడియాకు చిక్కుతున్నారు. ఇటీవల నటి హేమ,  ‘మా’ అధ్యక్ష్యుడు నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “కొత్తగా ఫండ్స్ తీసుకురాకుండానే.. పాత ఫండ్ మొత్తం తినేశారని.. ఎన్నికలు జరపకుండా తానే అధ్యక్షుడిగా కొనసాగేలా నరేష్ చూస్తున్నారని ఆమె  ఆరోపిస్తూ  ఓ వాయిస్ మెసేజ్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వాయిస్ […]

Update: 2021-08-09 01:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరోసారి ‘మా'(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) లో రగడ మొదలైంది. ఇంకా ఎన్నికలు మొదలు కాకముందే ఒకరి మీద ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటూ మీడియాకు చిక్కుతున్నారు. ఇటీవల నటి హేమ, ‘మా’ అధ్యక్ష్యుడు నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “కొత్తగా ఫండ్స్ తీసుకురాకుండానే.. పాత ఫండ్ మొత్తం తినేశారని.. ఎన్నికలు జరపకుండా తానే అధ్యక్షుడిగా కొనసాగేలా నరేష్ చూస్తున్నారని ఆమె ఆరోపిస్తూ ఓ వాయిస్ మెసేజ్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వాయిస్ మెసేజ్ ‘మా’ లో కలకలం రేపుతోంది. ఇప్పటివరకు నరేష్ తాను ఒక్క రూపాయి కూడా తన స్వార్థం కోసం తీసుకోలేదని చెప్తూ వస్తుండగా.. హేమ మాటలు ‘మా’ లో దుమారం రేపుతున్నాయి.

ఇక హేమ చేసిన ఆరోపణలపై ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ స్పందించారు. హేమ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. “తాము ‘మా’ ఫండ్స్ తినేశాం అనే హేమ ఆరోపణలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబానికే పెద్ద నష్టమని, హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కరోనా కారణంగా ఎలక్షన్స్ వాయిదా వేశామని, పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని వివరించారు. మా కోసం మేము పడిన కష్టం చూసి చిరంజీవి గారు కూడా మాకు ఫోన్ చేసి మెచ్చుకున్న విషయం హేమకు తెలియదా..? ఫండ్స్ తినేశాం అన్న హేమ మాటలు చాలా బాధించాయని” అన్నారు.

మా ఎలక్షన్స్ ఈసారి మంచి రసవత్తరంగా సాగనున్నాయి. ఎప్పుడు అధ్యక్ష పదవికి ఇద్దరు మాత్రమే పోటీపడుతుండగా.. ఈసారి ఒకే పదవి కోసం ఐదుగురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ను ప్రకటించగా.. విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు గట్టి పోటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ ‘మా’ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Tags:    

Similar News