కరీనా కపూర్ లగ్జరీ కారు కొట్టేసిన కేరళ వ్యాపారి
దిశ, సినిమా : లోకల్ మేడ్ మెటీరియల్‌కు పురాతన చరిత్ర కలిగి ఉందని నమ్మించి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పోలీసులను మోసం చేసిన మోన్‌సోన్ మవుంకల్ అనే వ్యక్తి గతంలో వార్తల్లో నిలిచాడు. జుడాస్ వెండి, టిప్పు సుల్తాన్ రాజసింహాసనం లాంటి ఐకానిక్ వస్తువులు కూడా తన దగ్గర ఉన్నాయని నమ్మించి కోట్లు కొల్లగొట్టాడు. ఈ క్రమంలోనే 2017లో రూ.10 కోట్ల మోసానికి పాల్పడిన ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. మళ్లీ ఇప్పుడు హెడ్ లైన్స్ టచ్ […]
దిశ, సినిమా : లోకల్ మేడ్ మెటీరియల్‌కు పురాతన చరిత్ర కలిగి ఉందని నమ్మించి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పోలీసులను మోసం చేసిన మోన్‌సోన్ మవుంకల్ అనే వ్యక్తి గతంలో వార్తల్లో నిలిచాడు. జుడాస్ వెండి, టిప్పు సుల్తాన్ రాజసింహాసనం లాంటి ఐకానిక్ వస్తువులు కూడా తన దగ్గర ఉన్నాయని నమ్మించి కోట్లు కొల్లగొట్టాడు. ఈ క్రమంలోనే 2017లో రూ.10 కోట్ల మోసానికి పాల్పడిన ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. మళ్లీ ఇప్పుడు హెడ్ లైన్స్ టచ్ చేశాడు. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పేరు మీద రిజిస్టర్ అయిన కారు(2007 మోడల్ పోర్‌శ్చే బాక్స్‌టర్)ను కేరళలో తన నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌లో రణ్‌ధీర్ కపూర్ పేరు ఫాదర్ కాలమ్ కింద ఉండగా.. కరీనా ముంబై ఇంటి అడ్రస్ మెన్షన్ చేసి ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేయకుండా మోన్‌సోన్ ఈ కారును ఎలా సంపాదించాడనేది తెలియాల్సి ఉంది.