లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో 22 వేల ఉద్యోగాలకు గండం!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా విమానయాన రంగం గతంలో ఎన్నడూ లేనంత భారీ నష్టాలను చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించగా, వాటిని అనుసరిస్తూ జర్మన్‌కు చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ కూడా సుమారు 22వేల మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది. ఆర్థికంగా తీవ్ర నష్టాలను చూస్తున్నామని, ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కార్మిక సంఘాలతో చర్చించిన అనంతరం లుఫ్తాన్సా ప్రతినిధి ఈ విషయం గురించి వివరించారు. […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా విమానయాన రంగం గతంలో ఎన్నడూ లేనంత భారీ నష్టాలను చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించగా, వాటిని అనుసరిస్తూ జర్మన్‌కు చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ కూడా సుమారు 22వేల మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది. ఆర్థికంగా తీవ్ర నష్టాలను చూస్తున్నామని, ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కార్మిక సంఘాలతో చర్చించిన అనంతరం లుఫ్తాన్సా ప్రతినిధి ఈ విషయం గురించి వివరించారు. గతంలో 10 వేల మంది ఉద్యోగాలు పోతాయని అంచనా వేసినప్పటికీ ఇప్పుడది చాలా ఎక్కువని చెప్పారు. అయితే, ఉద్యోగుల తొలగింపును విరమించుకోవాలని ఫ్లైట్ అటెండెంట్స్ యూనియన్(యూఎఫ్‌వో) డిమాండ్ చేస్తోంది. యూనియన్‌లో ఉన్న సుమారు 45 శాతం మంది వేతనాల తగ్గింపునకు సుముఖంగా ఉన్నారని, దీనివల్ల కంపెనీకి 350 యూరోల నష్టం భర్తీ అవుతుందని కాబట్టి ఉద్యోగులను కాపాడాలని అభ్యర్థిస్తోంది. కొవిడ్-19 సంక్షోభం వల్ల వేలాది మంది ఉద్యోగాల తొలగింపు, ఆస్తుల అమ్మకాలు లాంటి వ్యూహాలను లుఫ్తాన్సా అమలు పరుస్తోంది. ఇక, ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో జర్మనీ 9వ స్థానంలో ఉండగా, అక్కడ కరోనా వల్ల అన్ని రంగాలు తీవ్రంగా నష్టాలను చూస్తున్నాయి. ఇప్పట్లో అక్కడ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.