ఆ రైతు భూమి.. వజ్రాల గని
దిశ, ఫీచర్స్ : చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు మనకు కట్టలకొద్దీ డబ్బు దొరికితే భలే ఉంటుందని, ఎవరికైనా లాటరీలో కోట్ల రూపాయలు గెలిస్తే ఇలాంటివి మనకెందుకు రావని అనుకుంటుంటాం. అయినా అదృష్టం ఏదో ఒకసారి తలుపుతడుతుందని భావిస్తాం. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ రైతుకు మాత్రం రెండేళ్లలో ఏకంగా ఆరుసార్లు వజ్రాలు దొరకడం విశేషం. ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న భూమిలో ఆరోసారి తనకు అత్యున్నత వజ్రం దొరికినట్లు ప్రకాశ్ మజుందార్ తాజాగా వివరించాడు. అతడికి దొరికిన […]
దిశ, ఫీచర్స్ : చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు మనకు కట్టలకొద్దీ డబ్బు దొరికితే భలే ఉంటుందని, ఎవరికైనా లాటరీలో కోట్ల రూపాయలు గెలిస్తే ఇలాంటివి మనకెందుకు రావని అనుకుంటుంటాం. అయినా అదృష్టం ఏదో ఒకసారి తలుపుతడుతుందని భావిస్తాం. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ రైతుకు మాత్రం రెండేళ్లలో ఏకంగా ఆరుసార్లు వజ్రాలు దొరకడం విశేషం. ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న భూమిలో ఆరోసారి తనకు అత్యున్నత వజ్రం దొరికినట్లు ప్రకాశ్ మజుందార్ తాజాగా వివరించాడు. అతడికి దొరికిన ఆ విలువైన రాయి బరువు 6.47 క్యారెట్లు.
జరువాపూర్ గ్రామంలోని ప్రకాశ్ మజుందార్‌కు దాదాపు రూ. 30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. ఇదివరకే తన పొలంలో ఐదుసార్లు వజ్రం దొరకడంతో, మరోసారి అదృష్టాన్ని పరీక్షించేందుకు తన ముగ్గురు స్నేహితులతో తవ్వకాలు చేపట్టాడు. తాను అనుకున్నట్లే ఈసారి మరో వజ్రం లభించగా దాన్ని ప్రభుత్వ కార్యాలయంలో డిపాజిట్ చేశాడు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధర నిర్ణయించి, దీన్ని వేలంలో అమ్మకానికి ఉంచుతారు. వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించిన తర్వాత రైతుకు ఇస్తామని అధికారులు తెలిపారు. వేలం నుంచి పొందిన మొత్తాన్ని మజుందార్, గనిని త్రవ్వడంలో సాయపడిన అతని నలుగురు భాగస్వాములతో పంచుకుంటానని తెలిపాడు. గత సంవత్సరం తనకు 7.44 క్యారెట్ల వజ్రం లభించిందని, అంతేకాకుండా రెండేళ్లలో 2 నుంచి 2.5 క్యారెట్ల బరువున్న నాలుగు విలువైన రాళ్లను కూడా దొరికినట్లు ఆయన పేర్కొన్నాడు.