బిగ్ షాక్.. భారీగా పెరుగనున్న గ్యాస్ సిలిండర్ ధర.!

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో సామాన్యుడికి మరో బిగ్ షాకింగ్ న్యూస్. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు మరో చేదు వార్త. వంట గ్యాస్ ధరలను పెంచేందుకు చమురు సంస్థలు మరోసారి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి సిలిండర్‌పై ఏకంగా రూ.100 వరకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీపావళి పండుగకు ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ […]

Update: 2021-10-27 21:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో సామాన్యుడికి మరో బిగ్ షాకింగ్ న్యూస్. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు మరో చేదు వార్త. వంట గ్యాస్ ధరలను పెంచేందుకు చమురు సంస్థలు మరోసారి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి సిలిండర్‌పై ఏకంగా రూ.100 వరకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

దీపావళి పండుగకు ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.100 వరకు పెరగనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందునే తాము కూడా ధరలను పెంచాల్సి వస్తోందని చమురు, సహజవాయు కంపెనీలు చెబుతున్నాయి.

అయితే, ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. జూలై నుంచి ఇప్పటివరకు రూ.90కిపైగా సిలిండర్ ధర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.952గా కొనసాగుతోంది.

Tags:    

Similar News