వంటగ్యాస్ వినియోగదారులకు షాక్..
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. తాజాగా వంటగ్యాస్‌పై రూ. 25.50 పెంచుతున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపు నేటి నుంచి అమలులోకి రానున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో వంటగ్యాస్(14.2కిలోలు)ధర 834.50కు చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ధర 834.50కి చేరింది. మరో వైపు కమర్షియల్ సిలిండర్లపై రూ.84 పెంచుతున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. కాగా సాధారణంగా ప్రతి నెలా మొదటి రోజున ఎల్‌పీజీ గ్యాస్ […]
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. తాజాగా వంటగ్యాస్‌పై రూ. 25.50 పెంచుతున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపు నేటి నుంచి అమలులోకి రానున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో వంటగ్యాస్(14.2కిలోలు)ధర 834.50కు చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ధర 834.50కి చేరింది. మరో వైపు కమర్షియల్ సిలిండర్లపై రూ.84 పెంచుతున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. కాగా సాధారణంగా ప్రతి నెలా మొదటి రోజున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పెంచుతుంటాయి. కానీ ఏప్రిల్‌లో 14.2కేజీల సిలిండర్లపై రూ.10 తగ్గించింది. ఇక మే నెలలో వంటగ్యాస్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.