కలిసి జీవించాలని ఎన్నో కలలు కన్నారు.. నెరవేరకుండానే లోకాన్ని విడిచారు
దిశ, సూర్యాపేట : వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నారు. కులాలు వేరైనా కలిసి బతుకుదామని నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల ప్రేమను పెద్దలు కాదనే సరికి వారిని ఎదురించలేక, కలిసి జీవించలేక చావే శరణ్యం అనుకున్నారు. ఇద్దరూ ఎవరింట్లో వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వెలుగుచూడగా, వారి బంధువులను, స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్‌కు చెందిన నాగమణి (24), దుబ్బతండాకు […]
దిశ, సూర్యాపేట : వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నారు. కులాలు వేరైనా కలిసి బతుకుదామని నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల ప్రేమను పెద్దలు కాదనే సరికి వారిని ఎదురించలేక, కలిసి జీవించలేక చావే శరణ్యం అనుకున్నారు. ఇద్దరూ ఎవరింట్లో వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం వెలుగుచూడగా, వారి బంధువులను, స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్‌కు చెందిన నాగమణి (24), దుబ్బతండాకు చెందిన ధారావత్ నెహ్రూ(28) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నెహ్రూ స్థానికంగా మేస్త్రీ పనిచేస్తుండగా, నాగమణి ఇటీవల నర్సింగ్ విద్యనభ్యసించి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది. ఈ నేపథ్యంలోనే వీరి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. అయితే, నాగమణి తల్లిదండ్రులు కులాలు వేరు కావడంతో ప్రేమపెళ్లికి నిరాకరించారు. వెంటనే మరో వ్యక్తితో ఆమెకు వివాహం చేసేందుకు నిర్ణయించారు.
విషయం తెలుసుకున్న ధారావత్ నెహ్రూ దుబ్బతండాలోని తన నివాసంలో శనివారం ఉరేసుకుని మృతిచెందాడు. నెహ్రూ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న అతని ప్రేయసి నాగమణి హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్-చందానగర్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి అదే రోజు రాత్రి ప్రాణాలు విడిచింది. ఆమె మృతదేహన్ని కుటుంబ సభ్యులు సుందరయ్య నగర్‌కు ఆదివారం తీసుకొచ్చారు. చేతికి అందివచ్చిన కుమార్తె మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఫోన్‌కాల్స్ ఆధారంగా నాగమణి మృతిపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ప్రేమికులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.