జగిత్యాలలో ప్రేమజంట ఆత్మహత్య

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా హైదర్‎పల్లిలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లో పురుగుల మందు తాగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమికులు. పాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో లోపలికి వెళ్లి చూడగా.. రెండు డెడ్ బాడీలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమికులిద్దరూ 10రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు […]

Update: 2020-11-16 01:47 GMT

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా హైదర్‎పల్లిలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లో పురుగుల మందు తాగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమికులు. పాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో లోపలికి వెళ్లి చూడగా.. రెండు డెడ్ బాడీలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమికులిద్దరూ 10రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే… హైదర్‎పల్లికి చెందిన నలువాల మధు, సిరిసిల్ల జిల్లా మల్లాపూర్‌కు చెందిన ఐలేని సౌమ్య గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇటీవల ఇద్దరు కలుసుకోకూడదని అంక్షలు విధించారు. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన సౌమ్య ఇంటో నుంచి వెళ్లిపోయింది. అలాగే మధు ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సోమవారం ఓ పాడుబడిన ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా దూలానికి యువతి, యువకుడి మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలు కుళ్లిపోవడంతో శరీరం నుంచి తల కిందపడింది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడం, కలుసుకునేందుకు సైతం ఆంక్షలు విధించడంతో మనస్థాపంతోనే పురుగుల మందు తాగి, అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News