ప్రేమ కోసం పురుగుల మందు తాగారు
దిశ, ములుగు : ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామ సమీపంలోని దేవాదుల పైప్ లైన్ వద్ద శుక్రవారం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నల్ల గుంట గ్రామానికి చెందిన ధరమ్ సోత్ రాజేష్ 21ఏళ్ల యువకుడు, భూపాలపల్లికి చెందిన భూక్యా శ్రావణి 17ఏళ్ల యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా అమ్మాయి మైనర్ కావడంతో కుటుంబసభ్యులు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో గురువారం నల్లగుంటలోని బంధువుల ఇంటికి వచ్చిన యువతిని ఈ […]
దిశ, ములుగు : ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామ సమీపంలోని దేవాదుల పైప్ లైన్ వద్ద శుక్రవారం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నల్ల గుంట గ్రామానికి చెందిన ధరమ్ సోత్ రాజేష్ 21ఏళ్ల యువకుడు, భూపాలపల్లికి చెందిన భూక్యా శ్రావణి 17ఏళ్ల యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా అమ్మాయి మైనర్ కావడంతో కుటుంబసభ్యులు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో గురువారం నల్లగుంటలోని బంధువుల ఇంటికి వచ్చిన యువతిని ఈ రోజు ఉదయం యువకుడు కలిశాడు. ఆపై ఇద్దరు కలిసి గ్రామ సమీపంలో దేవాదుల పైపు లైను దగ్గర పురుగులమందు తాగి బలవన్మరణానికి యత్నించారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత వారిద్దరినీ మల్లంపల్లిలోని ప్రైవేటు క్లినిక్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.