ఆమె కోసం గెటప్ మార్చిన యువకుడు.. అది జారీ కింద పడడంతో
దిశ, వెబ్ డెస్క్: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోరని తెలిసి రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. కానీ ఆ విషయం కాస్త అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో ఆమెను ఇంట్లో బంధించారు. అయితే యువకుడికి భార్యను చూడాలనిపించింది. ఎలాగైనా అత్తగారింటికి వెళ్లి భార్యను కలవాలనుకున్నాడు. కానీ ఇలా వెళితే అందరు తనను గుర్తుపడతారనుకొని ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. కానీ చివరికి ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో అందరి ముందు నవ్వులపాలయ్యాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి […]
దిశ, వెబ్ డెస్క్: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోరని తెలిసి రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. కానీ ఆ విషయం కాస్త అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో ఆమెను ఇంట్లో బంధించారు. అయితే యువకుడికి భార్యను చూడాలనిపించింది. ఎలాగైనా అత్తగారింటికి వెళ్లి భార్యను కలవాలనుకున్నాడు. కానీ ఇలా వెళితే అందరు తనను గుర్తుపడతారనుకొని ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. కానీ చివరికి ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో అందరి ముందు నవ్వులపాలయ్యాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..
బదౌహీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమించుకుని పెద్దలు ఒప్పుకోరని భావించి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. కానీ వారి ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో యువకుడికి వార్నింగ్ ఇచ్చి అమ్మాయిని ఇంట్లో బంధించారు. దీంతో ఆ యువకుడు తన భార్యను కలిసేందుకు అన్నీ విధాల ప్రయత్నించాడు. చివరకు ఇలా అయితే కుదరదని వేషం మార్చాడు. అబ్బాయి కాస్త అమ్మాయిలా తయారై తన భార్య ఇంటికి వెళ్లాడు. చక్కగా అమ్మాయిలా డ్రెస్ వేసుకొని , విగ్ పెట్టుకొని, లేడీస్ చెప్పులు వేసుకొని ముఖాన్ని చున్నీతో కప్పుకొని భార్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ తాను ప్రేయసి ఫ్రెండ్ అని, తనతో మాట్లాడదామని వచ్చానని చెప్పాడు.
#भदोही:-जब बात '#इजहार_ए_मोहब्बत' की हो तो….
यूं ही नहीं कहते #ऐ_सनम, यह #इश्क_नहीं_आसां
उत्तर प्रदेश के #भदोही जिलें में अपनी #मोहब्बत को पाने #दुल्हन_के_लिबास में पहुंचा प्रेमी #बेचारे को चाहिए थी #लुगाई मिल गई #कुटाई @bhadohipolice @DM_Bhadohi pic.twitter.com/S6rHALHKMu
— Anant News (@news_anant) June 2, 2021
అంతా బావుంది కానీ యువకుడు పెళ్లి డ్రెస్ లో రావడంతో అక్కుడున్నవారికి అనుమానమొచ్చింది. చున్నీ తీసి ముఖం చూపించాలని వారు కోరగా యువకుడు కుదరదని పట్టుబట్టాడు ఈ క్రమంలో ముఖం కనిపించకుండా చున్నీ వేసుకుంటుండడంతో జుట్టు పక్కకు జరిగింది. ముఖం చూపించాలని కుటుంబీకులు పట్టుబట్టి తీసేందుకు ప్రయత్నించగా జుట్టు కిందపడిపోయింది. దీంతో అందరూ షాక్కు గురయ్యారు. వెంటనే తేరుకొని పట్టుకొనేలోపు యువకుడు పరారయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అరెరే ప్రేమ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నావ్ భయ్యా అని కొందరు.. మీ అమ్మాయి కోసం ఆ అబ్బాయి ఎంతగా తాపత్రయపడుతున్నాడో చూశారుగా ఇచ్చేయండి .. మీ పిల్లను ఇచ్చేయండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.