బోడకొండ వాటర్ ఫాల్స్ వద్ద 'లవ్ స్టోరీ' టీమ్ సందడి..!
టాలీవుడ్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ లాంటి హిట్ సినిమా తర్వాత ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ఫీల్ గుడ్ మూవీ అనే మార్క్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా […]
టాలీవుడ్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ లాంటి హిట్ సినిమా తర్వాత ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ఫీల్ గుడ్ మూవీ అనే మార్క్‌ను సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడ – బోడకొండ వాటర్ ఫాల్స్ వద్ద చిత్రీకరణ జరిపారు. చుట్టూ పచ్చటి ప్రకృతి సౌందర్యంతో ఆకట్టుకునే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చిత్రయూనిట్ సందడి చేశారు.