హుజురాబాద్‌లో జోరుగా ప్రలోభాల పర్వం.. నేరుగా నగదు బదిలీ

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్​ ఉప ఎన్నికలో భాగంగా లీడర్లను పంచుకోవడం పూర్తి అయింది. నిన్నటిదాకా ఒక పార్టీ జెండా ఎత్తుకున్నోళ్లు ఉప ఎన్నికల పుణ్యమా అని పార్టీలు మారారు. ఎర్రన్నలు కాషాయ జెండా మోస్తున్నారు. కాషాయ జెండా మోసినవారు గులాబీ జెండా అందుకున్నారు. మొత్తానికి ఈటల రాజేందర్​ను ఓడించాలనే టీఆర్​ఎస్​ లక్ష్యానికి హుజురాబాద్​ సెగ్మెంట్​ లీడర్లకు కలిసి వచ్చింది. మరో పది రోజుల్లో పోలింగ్​ ప్రక్రియ ఉండటంతో.. పార్టీలన్నీ గ్రామాలు, వీధుల్లో ఓట్ల కోసం వేట […]

Update: 2021-10-20 00:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్​ ఉప ఎన్నికలో భాగంగా లీడర్లను పంచుకోవడం పూర్తి అయింది. నిన్నటిదాకా ఒక పార్టీ జెండా ఎత్తుకున్నోళ్లు ఉప ఎన్నికల పుణ్యమా అని పార్టీలు మారారు. ఎర్రన్నలు కాషాయ జెండా మోస్తున్నారు. కాషాయ జెండా మోసినవారు గులాబీ జెండా అందుకున్నారు. మొత్తానికి ఈటల రాజేందర్​ను ఓడించాలనే టీఆర్​ఎస్​ లక్ష్యానికి హుజురాబాద్​ సెగ్మెంట్​ లీడర్లకు కలిసి వచ్చింది. మరో పది రోజుల్లో పోలింగ్​ ప్రక్రియ ఉండటంతో.. పార్టీలన్నీ గ్రామాలు, వీధుల్లో ఓట్ల కోసం వేట సాగిస్తున్నాయి. నిన్నటిదాకా లోకల్​ లీడర్లను నమ్ముకున్న పార్టీలన్నీ ఇప్పుడు అమాత్యుల నుంచి మొదలుకుని కీలక నేతల వరకు వీధిస్థాయికి వెళ్లి ఓటర్లను కలిసేందుకు ప్లాన్​ వేస్తున్నారు.

ఇదే అసలు సమయం

ఈ పది రోజుల్లో ఓటర్లను మల్చుకోవడం కీలకంగా భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ, టీఆర్​ఎస్​ మధ్య పోటీ ఉన్నా.. కాంగ్రెస్​ కూడా ఎంతో కొంత ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారపర్వాన్ని యుద్ధరీతిన సాగిస్తున్నాయి. మంత్రులు అక్కడే మకాం వేశారు. బీజేపీ నుంచి కీలకమైన నేతలు కూడా వస్తున్నారు. రెండు రోజుల నుంచి కాంగ్రెస్​ పార్టీ సీనియర్లు సైతం ప్రచారపర్వాన్ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో గల్లీ స్థాయి నుంచి ఓట్లను ఎలా రాబట్టుకోవాలనే ప్లాన్​ వేసుకుంటున్నారు.

లీడర్లను వదిలేశారు

ఇప్పటి వరకు స్థానిక నేతలపై దృష్టి పెట్టిన టీఆర్​ఎస్​, బీజేపీ.. ఇప్పుడు లీడర్లను వదిలేసింది. లీడర్లతో అనుకున్న స్థాయిలో ఓట్లు వస్తాయా.. రావా అనే అనుమానాలతో గ్రామాల్లో పోలింగ్​ బూత్​ల వారీగా ఓటరు జాబితాను పట్టుకుంటున్నారు. గతంలో మహిళా సంఘాలు, గ్రామైక్య సంఘాలతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పార్టీలు.. ఇప్పుడు వారందరినీ కాదని నేరుగా రంగంలోకి దిగుతున్నాయి. గ్రామస్థాయిలో మంత్రులు, ఆ స్థాయి నేతలే అభ్యర్థుల తరుపున ఓటర్లతో మాట్లాడుతున్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులకు ఈ హుజురాబాద్​లో ప్రత్యేక రాయితీలే అందిస్తున్నారు. ఇక పోలింగ్​ బూత్​ల వారీగా ఓటరు జాబితా ప్రకారం గంపగుత్తగా ఓట్లను మల్చుకునేందుకు బేరాలాడుతున్నారు. ఇప్పటి వరకు స్థానిక నేతలకు ఎంతో కొంత ముట్టచెప్పినా.. అవి ఓటర్ల వరకు చేరడం లేదనే కారణంతో నేరుగా ఓటరు జాబితా పట్టుకుని వీధుల్లో తిరుగుతున్నారు.

Tags:    

Similar News